ఆచార్య జయశంకర్ మార్గం అనుసరణీయం :: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ, ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత ఆచార్య జయశంకర్ చూపిన మార్గం అనుసరణీయమని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక సంక్షేమ, అభివృద్ది పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. ఆచార్య జయశంకర్ స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులని, రాష్ట్ర అభివృద్ది కొరకు ప్రణాళికలు సైతం రూపొందించారని ఆమె అన్నారు. ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా పంచాయతి అధికారి కె. రంగాచారి, ఏడి హ్యాండ్లూమ్స్ ఎం. సాగర్, జిల్లా ఉపాధికల్పన అధికారిణి సిహెచ్. ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీచేయనైనది.

Share This Post