పత్రికా ప్రకటన తేదీ: 11-11-2021
కరీంనగర్
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు
రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కుల పట్ల అవగాహన కల్పించాలి
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై.రేణుక
కరీంనగర్ ర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పెద్ద పెల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్
000000
జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని, రాజ్యాంగం కల్పించిన చట్టాలు హక్కులు పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ యార రేణుక అన్నారు.
గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి పెద్ద పెల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్, ఎస్పి లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెంబర్ సెక్రటరి యార రేణుక మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు పూర్తయి ఆజాది కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలు,ఉచిత న్యాయ సేవల పై దేశ వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ,రాష్ట్ర, జిల్లా,మండల న్యాయ సేవాధికార సంస్ధల ,రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు,బాధ్యతలతో పాటు,రాజ్యాంగం లోని ఆర్టికల్ 39 ఏ లో పేర్కొన్న విధంగా పేదలకు,బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు, అందరికి న్యాయం గురించి గ్రామ స్థాయి లో ప్రతి ఒక వ్యక్తికి చేరే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.ఏ వ్యక్తి పైన నైనా నేరం ఆరోపించబడి నపుడు శిక్ష పడకుండా కోర్ట్ లో న్యాయవాదిని నియమించు కోవాల్సి ఉంటుందని అన్నారు.చాలా మందికి ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికి అప్పు చేసి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన లేకపోవడం,తెలియక పోవడం వలనే ఆర్ధిక భారం పడుతుందని,క్రిమినల్,సివిల్ కేసుల్లో కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా న్యాయవాది ఫీజు చెల్లించి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్, పోస్ట్ఆఫిస్ ఇతర కార్యాలయా లు ప్రజలకు ఎలా తెలుసో జిల్లా న్యాయ సేవాధికార సంస్ట,మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ల గురించి ,న్యాయ సేవలు గురించి తెలుపాల్సిన అవసరం వుందని అన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవా సదన్ లో, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం మండల జూనియర్,సీనియర్ సివిల్ జడ్జి భవనాల కోర్ట్ ప్రాంగణం లో ఉంటుందని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు జరిగి 25 సం. లు పూర్తి అయిందని అన్నారు.3 లక్షల రూ.ల కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వారికి,మహిళలు అందరికి,పిల్లలు అందరి కీ,అసంఘటిత రంగంలో కార్మికులకు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని అన్నారు. 90 శాతం జనాభాకు ఉచిత న్యాయ సహాయం అందించాల్సి అవసరం ఉన్నప్పటికీ కేవలం ఒక శాతం ప్రజలు మాత్రమే ఉచిత న్యాయ సేవలు ఉపయోగించుకుంటున్నారని ఆమె అన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలు,అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు,మెగా క్యాంపు లు, వివిధ కేసుల్లో బాధితులకు అందిస్తున్న పరిహారం కు సహాయం తదితర సేవలను జిల్లా అధికారులు,మండల అధికారులు,గ్రామ అధికారులు,ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని,గ్రామాలలో టామ్ టామ్ ( దండోరా) చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా ప్రజలకు లబ్ది జరిగేలా అమలు చేస్తున్నారో అదే విధంగా అధికార యంత్రాంగం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. గ్యాంగ్ రేప్ బాధితు రాలికి , హత్యకు గురైన వ్యక్తి పై ఆధారపడిన వారికి ప్రభుత్వం తరపున 5 లక్షల నుండి 10 లక్షలు, యాసిడ్ బాధితులకు 7 లక్షల నుండి 8 లక్షల వరకు , అంగ వైకల్యం సంభవిస్తే ఒక లక్ష నుండి 2 లక్షలు పరిహారం ప్రభుత్వం అందిస్తుందని,చాలా మంది పరిహారం పొంద లేక పోతున్నారని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో దరఖాస్తు చేసుకుంటే పరిహారం అందించేందుకు సహాయం చేస్తామని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చిన పారా లీగల్ వాలంటీర్ ల ద్వారా ఉచిత న్యాయ సేవలు గురించి అవగాహన కల్పిస్తున్నట్లు,అధికారులు,ప్రజా ప్రతినిధులు కూడా సహకారం అందించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం,వివిధ శాఖల లబ్ధిదారులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి దారులకు కు చేరే విధంగా సహకారం జిల్లా యంత్రాంగం అందిస్తుందని,అన్ని ప్రభుత్వ ముఖ్య కార్యాలయం లలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు,ఫోన్ నుంబర్ లు ప్లెక్సీ లు,బోర్డ్ లు ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని అన్నారు.
పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన వారికి న్యాయ సేవలు అందినపుడే సార్థకత వుంటుందని అన్నారు.
అనంతరం పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ఈ ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సుజయ్ కుమార్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, డి సి పి శ్రీనివాస్, ఏ సి పి మదన్ లాల్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.