ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఒడియఫ్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామాల అమలుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామాలలో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రచార రథాన్ని గురువారం రోజున కలెక్టరేట్ లో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారంగా అన్ని గ్రామాలలో పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలపై మొదటి ప్రాధాన్యత తో నిర్వహించాలని అన్నారు. గుర్తించబడిన 20 గ్రామపంచాయితీలలో ఒడియఫ్ ను వచ్చే మార్చ్ 31 లోగ ప్రకటించే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.అందులో భాగంగా ఈ రోజు రథయాత్రను ప్రారంభించి గ్రామాలలో బహిరంగ మలవిసర్జనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే మార్చ్ మాసాంతం లోగా ఒడియఫ్ త్రి స్టార్, టూ స్టార్, వన్ స్టార్ కార్యక్రమాలను అమలుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, గత నెల నుండి జిల్లాలో ఘనంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను పాఠశాలలు, గ్రామపంచాయితీలలో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో గుర్తించబడిన 20 గ్రామపంచాయితీలను ఒడియఫ్ గా నామినేట్ చేయడం జరిగిందని, వచ్చే మార్చ్ లోగా పూర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శానిటేషన్, వాల్ పేంటింగ్, ఒడియఫ్, టాయిలెట్, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, స్వచ్ఛ భారత్ మిషన్ ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post