ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్

స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్బంగా అప్పటి స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం ఉదయం నుహ్రు యువకేంద్ర వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ కు జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుండి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన 2 కి.మీ పరుగులో కలెక్టర్ స్వయంగా పరిగెత్తుతూ యువకులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ స్ఫూర్తినిచ్చారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ 2 కె రన్ లో కళాశాల విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని గాంధీ పార్క్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతి సమైక్యతను చాటుతు దేశ ప్రజలు, యువతలో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అహింసా సిద్ధాంతంతో యావత్ జాతిని ఒక్క తాటిపైకి తెచ్చి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన మన బాపూజీ ప్రపంచానికే ఆదర్శవంతుడయ్యారని కొనియాడారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేడు దేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉన్నామని అందుకే మహానీయులను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగ, ధ్యానం, వ్యాయామం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల దేశం మొత్తం ఆరోగ్యవంతమైన భారతదేశం గా ఆవిష్కరించబదుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి కోట నాయక్, వ్యాయామ ఉపాద్యాయులు, యువతీ, యువకులు, విద్యార్థులు కళాశాల లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post