ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ రన్ ను శనివారం స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో జెండా ఊపి 2కే రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్.

వ్యాయామం తోనే ఆరోగ్యవంతమైన సమాజం

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఆజాదీ కా అమృత్ రన్ ప్రారంభించిన కలెక్టర్

000000

ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ 30 నిమిషాల పాటు ప్రతిరోజు వ్యాయామం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ రన్ ను శనివారం స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో కలెక్టర్ సిపి సత్యనారాయణ తో కలిసి జెండా ఊపి 2కే రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రన్ కు ముందు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యువత ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.నేటి యువత శారీరక శ్రమ ఉన్న రన్నింగ్,జాగింగ్, ఆటలు, క్రీడలు ఆడడం లేదని మొబైల్ ఫోన్ లోని పబ్జి లాంటి మొబైల్ క్రీడాలకు బానిసలు మారి ఆడుతున్నారని, ఇది మానుకోవాలని యువతను కోరారు. అవసరానికే మొబైల్ ఫోన్ వినియోగించుకోవాలని సూచించారు. ప్రతినిత్యం అర గంట పాటు స్పోర్ట్స్ లేదా యోగ, శారీరక వ్యాయామం కోసం సమయం కేటాయించాలని తెలిపారు.

పోలీస్ కమీషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ యువత జీవనశైలిలో మార్పులు చేసుకుంటు ఆరోగ్యం పై ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్, అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడిని తగ్గించుకునేందుకు శారీరక వ్యాయామం దోహదపడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి, క్యాడెట్, యువతతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, ఎన్ సి సి క్యాడేట్స్, డిగ్రీ విద్యార్థులు, యువతీ యువకులు, క్రీడాకారుల తో అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమైన 2 కె రన్ భగత్ నగర్, కలెక్టరేట్ మీదుగా తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది.

ఈ 2 కె రన్ లో డి వై ఎస్ ఒ. కే. రాజావీర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి,ప్రభుత్వ ఎస్.ఆర్.ఆర్, ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ కళాశాలల, వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ అధికారులు బాలరాజు, కెప్టెన్ కిరణ్ జ్యోతి, డాక్టర్ రజనీ దేవి, బి సురేష్ కుమార్, వి వరప్రసాద్, నాయుడు, ఏ. నారాయణ, యువజన అవార్డు గ్రహీతలు కే. కిరణ్ కుమార్, కొండ రవి యాదవ్, సత్తి నేని శ్రీనివాస్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post