ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సెప్టెంబర్ 11న 2K రన్ కార్యక్రమము : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

పత్రికా ప్రకటన తేది:9.9.2021.
వనపర్తి.

భారతావని 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వము నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసులు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కేంద్రములో సెప్టెంబర్ 11న ఉదయము 7.30 నిమిషములకు స్థానిక పాల్టెక్నిక్ కళాశాల నుండి ఎకో పార్క్ వరకు 2K రన్ ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అనిల్ కుమార్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి కోటా నాయక్, జిల్లా అధికారులు, యువజనులు పురప్రముఖులు, ఈ 2K రన్ కార్యక్రమంలో పాల్గొని, రెండు కిలోమీటర్ల దూరం నడిచి మన స్వతంత్ర పోరాట సమరయోధులను స్మరిస్తూ, వాళ్లకు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించనున్నట్లు ఆమె తెలిపారు.
……………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడింది.

Share This Post