ఆజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా ఫ్రీడమ్ రన్:: సెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్

ఆజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా ఫ్రీడమ్ రన్:: సెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్

జనగామ, ఆగస్టు 21: స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జనగామలో శనివారం ఫ్రీడమ్ రన్ ను చేపట్టినట్లు నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్ అన్నారు. ఫ్రీడమ్ రన్ ని రాష్ట్ర సంచాలకులు బతుకమ్మకుంట వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బతుకమ్మకుంట నుండి నెహ్రూ పార్క్ వరకు సాగిన ఫ్రీడమ్ రన్ లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిట్ నెస్ కా డోస్ ఆదా గంట రోజ్, భారత మాతాకి జై నినాదాలతో ఫ్రీడమ్ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్వైకెఎస్ రాష్ట్ర సంచాలకులు మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు, స్వతంత్ర్య సమరయోధుల బలిదానాలు, త్యాగాల ఫలితంగానే నేడు భారత సమాజం స్వేచ్చా వాయువులను పీల్చుకోగలుగుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కలిసికట్టుగా ముందుకు నడవాలన్నారు. యువత సంకల్పం ముందు ఎవరెస్టు శిఖరం చిన్నబోతుందని, యువత తల్చుకుంటే సాధించనిది ఏదీ లేదని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమాల్లో యువత పాల్గొని మన జాతి ఐక్యతను ప్రపంచానికి చాటాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల, జనగామ ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జానినాయక్, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్ సభ్యులు, ఫిట్ ఇండియా, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post