ఆజాది కా అమృత్ మహోత్సవ్ – ఇండియా @75

ఆజాది కా అమృత్ మహోత్సవ్ – ఇండియా @75 వేడుకల్లో భాగంగా, నల్లగొండ జిల్లాలో నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ 2 న ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువకేంద్ర యువజన అధికారి ప్రవీణ్ సింగ్ తెలిపారు. శనివారం 02-10-2021 న ఉదయం 8:00 గంటలకు స్థానిక  ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాల మైదానం నుండి రెడ్ క్రాస్ భవన్ వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ఉంటుంది. దేశ వ్యాప్తంగా 744 జిల్లాలో ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నెహ్రు యువ కేంద్ర సంఘాటన్ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అజాదికా  అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు ఫిట్ ఇండియా 2k ఫ్రీడమ్ రన్ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యువత ఫ్రీడమ్ రన్  లో త్రివర్ణ పతాకంతో   పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాలు, NSS, NCC, రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Share This Post