ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో లో భాగంగా స్వచ్ఛతా హి సేవ గోడ పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్..హరీష్

ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో లో భాగంగా స్వచ్ఛతా హి సేవ గోడ పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్..హరీష్

దేశ స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు అయినా సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో లో భాగంగా జిల్లాలో ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవ పేర వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం నాడు తన ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ , డిఆర్ డివో శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, , స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయ అధికారి సంతోష్ తో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛత శ్రమదానం రౌండ్ ఒకటి లో అన్ని మండల, గ్రామా పంచాయితీలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పంచాయతీ స్థాయిలో స్వచ్ఛత జాగృతి యాత్ర ఏర్పాటు చేస్తూ సోకే పిట్స్ , కంపోస్ట్ పిట్స్ నిర్మాణాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త సేకరణ వంటి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కాగా జిల్లా స్థాయిలో స్వచ్ఛత సేవానివస్ అవార్డులు ప్రధానం చేయడం జరుగుతుందని అన్నారు. ఇక స్వచ్ఛత శ్రమదానం రెండవ రౌండ్ లో భాగంగా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ నిషేధం పై గ్రామా పంచాయితీలు తీర్మానం చేస్తారని, స్వచ్ఛ భారతి సేవా వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకై మండల, గ్రామా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించుటకు మండల పరిషద్ అభివృద్ధి అధికారులు, మండల్ పరిషద్ అధికారులకు తగు ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు.

Share This Post