ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 న ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 న  ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 న మెదక్ పట్టణంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. దేశ స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు అయిన సందర్భంగా జన్ భాగిదారి టు జన్ ఆందోళన్ పేరట నెహ్రు యువక కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఫ్రీడమ్ నిర్వహిస్తున్నామని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా అధికారులతో కలిసి టి-షర్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిమ సింగ్ మాట్లాడుతూ యువతలో, పౌరులలో దేశ భక్తిని పెంపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదికా అమ్రిత్ మహోత్సవ్ పేరట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదాని అన్నారు. అందులో భాగంగా దేశంలోని 744 జిల్లాలలో గత నెల ఆగస్టు 13 నుండి చేపట్టిన ఫ్రీడమ్ రన్ అక్టోబర్ 2 నాటికి ముగుస్తుందని అన్నారు. కాగా మెదక్ పట్టణంలో ఈ నెల 25 న ఉదయం 7. 30 గంటలకు ఫ్రీడమ్ రన్ ధ్యాన్ చాంద్ సర్కిల్ నుండి ప్రారంభమై రామ్ దాస్ చౌరస్తా వరకు కొనసాగుతుందని, ఈ ఫ్రీడమ్ రన్ లో జిల్లాలోని అధికారులు, సిబ్బంది, యువజన సంఘాలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో నెహ్రు యువక కేంద్రం జిల్లా యువజన అధికారి బిన్సీ, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, బి.సి. అభివృద్ధి అధికారి జగదీశ్, వ్యవసాయాధికారి పరశురామ్, సి.పి.ఓ. చిన కొట్యా నాయక్, డిపిఆర్ ఓ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post