ఆజాది కా అమ్రిత్ మాహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ యాత్ర ప్రచార వాహనము ను జండా ఊపి ప్రారంభించారు

ఆజాది కా అమ్రిత్ మాహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ యాత్ర ప్రచార వాహనము ను  జండా ఊపి ప్రారంభించారు

ఆజాది కా అమ్రిత్ మాహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ – 2021 పేర జిల్లా అంతటా శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ నుండి స్వచ్ఛా గ్రహ్ సత్యా గ్రహ్ పేర ఏర్పాటు చేసిన స్వచ్ఛ యాత్ర ప్రచార వాహనాన్ని అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, డిఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్ లతో కలిసి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా అంతటా పారిశుద్ధ్యం, శ్రమదానం కార్యక్రమాలపై ప్రజలలో అవగాహన కలిగిస్తూ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో తడి,పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన, మరుగుదొడ్ల వాడకం, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం, శ్రమదానం తదితర అంశాలపై ప్రజలలో చేతన్యం తేవడంతో పాటు శ్రమదానంలో పాల్గొని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుటలో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు. ఈ ప్రచార వాహనం శుక్ర,శనివారం నాడు కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, చిన్న శంకరంపేట్, చేగుంట, నార్సింగి మండలంలో పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తద్వారా గ్రామాల పారిశుద్యంతో పాటు వాతావరణ సమతుల్యం కాబట్టినవారమవుతామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయాధికారి సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post