ఆజాదీకా అమృత్ ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో ప్రజా చేరువ కార్యక్రమమును ( బ్యాంకింగ్ outreach program ) ప్రారంభించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,

చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి

1017 స్వయం సహాయక బృందాలకు114.24 కోట్ల రూపాయల రుణాలు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ బ్యాంకర్లను సూచించారు.

బుధవారం రెవెన్యూ గార్డెన్స్ లో ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగాపాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ అవుట్ రీచ్ కార్యక్రమంలో వివిధ బ్యాంకులు పాల్గొని పెద్ద ఎత్తున రుణాలను సహాయక బృందాలకు అందించడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకం అమలు చేస్తోందన్నారు. దళిత లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 10 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు ఎంపిక చేసి 17774 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రెండు వేల కోట్లు లబ్ధిదారుల ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు సక్రమంగా జమ చేయడం లో బ్యాంకర్లు అందించిన సహకారమునకు ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ తెలిపారు. బ్యాంకర్లు
పియం సన్నిధి ముద్ర పీఎంజెజెవై, తదితర రుణాలను కూడా అందిస్తున్నాయని అన్నారు. బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ప్రతి వినియోగదారునికి బ్యాంకింగ్ సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40మంది సహాయక బృందాలకు10.43 కోట్ల రూపాయలు, కే డి సి సి బ్యాంక్178 బృందాలకు7.63 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 183 గ్రూపులకు 25.35 కోట్లు, యు బి ఐ 84 గ్రూపులకు14 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు 130 గ్రూపులకు రూపాయలు, మెప్మా 124 గ్రూపులకు15.35 కోట్లు, డిఆర్డిఎ 278 గ్రూపులకు 40.75 కోట్లు మొత్తం 1017గ్రూప్ లకు 114.24 కోట్ల రూపాయల రుణాలను కలెక్టర్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మెప్మా పిడి రవీందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత ,జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ఎస్బిఐ ఏజీఎం రవి శేఖర్, ఎం శ్రీనివాస్, యూబిఐ ఏజీఎం నరసింగా రావు,కే డి సి సి బి సీఈఓ ఎం.సత్యనారాయణరావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామ్మోహన్ రావు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్కిల్ హెడ్ పి రాజీవ్, ఐ సి ఐ సి ఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ సురేష్ బాబు ఇతర బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post