ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శశాంక

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -03:

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ బ్యానర్ ను జిల్లా కలెక్టర్ శశాంక ఆవిష్కరించారు.

బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆజాదిక అమృత మహోత్సవం పురస్కరించుకొని భారత ప్రధాని పిలుపు మేరకు నిర్వహించే జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశ ప్రతి పౌరుడు దేశ గౌరవాన్ని , జాతీయ సమైక్యతను కాపాడుతూ, ప్రపంచ శాంతి కొరకు పాటు పడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పరికిపండ్ల అశోక్, స్వాతంత్ర సమరయోధులు వాసుదేవ్, FMM సంస్థ ప్రతినిధులు అనిల్, ఖాజాభి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post