ఆజాదీ అమృత్ మహోత్సవ ఉత్సవాలలో పాల్గొన్న యాదాద్రి కలెక్టర్…
భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల్లో అడుగు పెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాద్ అమృత మహోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కు సంబంధించి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. భారతదేశం స్వతంత్రానికి పూర్వం వాణిజ్యపరంగా నాటి పాలకుల ఇస్తానుసరం చేయవలసి వచ్చింది అన్నారు. స్వతంత్ర భారతం పురోగమించి నేడు ఎన్నో దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేస్తున్నామని అన్నారు. మన జిల్లా ఔషధ తయారీలో ఎంతో ముందున్నదని ప్రపంచానికి కావలసిన ఎన్నో ఔషధ ఉత్పత్తులు ఎగుమతి కావడం ఎంతో గర్వ కారణమన్నారు. పారిశ్రామిక వేత్తలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ప్రగతికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు భావితరం పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి అందజేయాలని, సామాజిక బాధ్యతను కూడా గుర్తించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కై దేశానికి ఆదర్శంగా నిలిచిన టీ ఎస్ ఐ పాస్ విధానం అమలు చేస్తుందని జిల్లా యంత్రాంగం కూడా ఎల్లవేళలా పరిశ్రమల అభివృద్ధికి అందజేస్తుందని అన్నారు. ఆజాద్ కి అమృత మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన ను జిల్లా కలెక్టర్ తినుబండారాల నుంచి రక్షణ కు ఉపయోగించే భాగాల వరకు ఒకే దగ్గర చూడడం, మన జిల్లాలో తయారుకావడం , ఎగుమతి కావడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో గాజు స్టీల్ ఔషధాలు ఔషధాలు ఆహార ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు , పేలుడు పదార్థాలు, ఆయుర్వేద, ఔషధ ఉత్పత్తి మొదలైన ఎగుమతుల ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీలక్ష్మి, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, పిక్కీ జాయింట్ డైరెక్టర్ వినోద్,ఎం ఎస్ ఎం ఈ డి ఐ అధికారి నవీన్ కుమార్, డి జి ఎఫ్ టి రిటైర్డ్ అధికారి శాస్త్రి, చేనేత అధికారులు గోకులే,విద్యాసాగర్, జిల్లా పరిశ్రమల అధికారులు, ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.