ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 2.0 ప్రారంబించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Press note. 05-10-2021

పిల్లలు వీడియో గేముల పై కాకుండా నిజమైన రియల్ గేములలో పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని   అన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర పండుగ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమృత మహోత్సవాలు పేరిట 75 వారాల పాటు దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాల నిర్వహణలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ హైదరాబాద్, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లాలో యువజన మరియు క్రీడల శాఖ ఆద్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 2.0 ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి ప్రారంబించి, కెనరా బ్యాంక్ ముందు నుండి భువనగిరి ఫోర్ట్ వరకు ఉదయం 7.30 గo.నిలకు నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ జిల్లా స్థానిక సంస్థల ఆదిలాబాద్ కలెక్టర్ ఫ్రీడం రన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో 200 మీటర్లు పొడవు గల జాతీయ పతాకాన్ని స్థానిక ప్రభుత్వపాఠశాలల సుమారు 200 మంది విద్యార్దులచే ప్రదర్శిస్తూ ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 2.0 ఘనంగా నిర్వహించడం జరిగినది.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, భారదేశానికి స్వాతంత్రo వచ్చి 75 సoవత్సరాలు అవుతున్నoదున, 75 వారాల పాటు నిర్వహిoచే ఈ ఉత్సవాలలో బాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 2.0 నిర్వహిస్తున్నామని, భువనగిరి జిల్లా పరిధిలోనే మొట్టమొదటిసారిగా 200 మీటర్ల జాతీయ పతాకాన్ని పిల్లలచే ప్రదర్శించడం ఇదే మొట్ట మొదటిసారని అన్నారు. ఎంతో చక్కగా పిల్లలంతా కలిసి జాతీయ సమైక్యతా భావంతో గౌరవ రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఫ్రీడం అంటేనే మంచి ఆరోగ్యం అని, మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశాన్ని అభివృద్ది చేయగలుగుతామని, మనం చిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యాల బారిన ఎక్కువగా పడలేదు, ఎందుకంటే అప్పుడు మనమంతా చురుకుగా శారీరక వ్యాయామాలు మనకు తెలియకుండానే అనేక పనుల ద్వారా చేసేవాళ్ళం కానీ పెరుగుతున్న ఆధునిక జీవన ప్రమాణాల దృష్ట్యా ఆరోగ్యం గురించి మరిచి పనుల్లో నిమగ్నం అయిపోతున్నాము, తద్వారా ఆనారోగ్యాల పాలు అవుతున్నాము. మనం అనారోగ్యబారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కనీసం 30ని.లు వ్యాయామము, రన్నింగ్, వాకింగ్ ప్రతి నిత్యం చేయాలని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతామని అన్నారు. ముఖ్యంగా పిల్లలు ఆన్లైన్ వీడియో గేముల పైన కాకుండా రియల్ గేములలో పాల్గొనాలని, తద్వారా శారీరక మానసిక దృఢత్వం పెంపొందుతుందని, భౌతిక క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, అంతేకాకుండా సమతుల పోషక ఆహారాన్ని కూడా తీసుకోవాలని అన్నారు. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం రాకముందు ఎలా వుండే వాళ్ళమో వచ్చిన తరువాత ఎలా ఉంటున్నాం అనే విషయాలను ఆనాటి స్వాతంత్ర సమరయోధులు పడ్డ శ్రమను గుర్తుంచుకోవాలని అన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజలంతా ముఖ్యంగా పిల్లలు వారి ప్రాథమిక విద్య స్థాయి నుండే తప్పనిసరిగా దేశ నిర్మాణం, ఆరోగ్యం అనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ఆరోగ్య భారత్ ను సాధించవచ్చునని అన్నారు.

స్థానిక మున్సిపల్ ఛైర్మన్ అంజనేయులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తూ, వ్యాయామం ప్రతినిత్యం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని , ఇలాంటి కార్యమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంపొంచవచ్చని, దీనికి ప్రజల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

జిల్లా యువజన‌ క్రీడల శాఖ అధికారి కె. ధనంజనేయులు మాట్లాడుతూ, ప్రపంచం అంతా ఈ రోజు ఆరోగ్యం పట్ల అనేక సమస్యలు, సవాళ్ళలను ఎదుర్కొంటుంది అందులో మన దేశం కూడా కోవిడ్ వంటి అనేక సవాళ్లను అధిగమిస్తూ ఈ రోజు ముందుకెళ్తుంది. సమస్త అనారోగ్యాలకు పరిష్కారం పరిశుబ్రత మరియు ఆరోగ్య నియమాలను పాటిస్తూ మంచి జీవన నైపుణ్య ప్రమాణాలు పెంపొందించుకోవాలని కోరినారు.

కార్యక్రమానంతరం గత నెల 2021 23 నుండి 27 వరకు నిర్వహించిన ప్రపంచ పర్యాటక వారోత్సవాలలో వర్షం కారణంగా వాయిదా పడిన హెరిటేజ్ టూర్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ హెరిటేజ్ యాత్రలో గత సంవత్సర కాలంగా కోవిడ్ – 19 బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన సుమారు 100 మంది బాల బాలికలను స్థానిక భువనగిరి ఖిల్లాను, రాక్ క్లిమ్బింగ్ స్కూల్ సందర్శింపచేసి, అనంతరం ఈ విజ్ఞాన విహార యాత్రలో భాగంగా కొలనుపాక జైన మందిర్ మరియు మ్యూజియం, రాజాపేట కోట తదితర చారిత్రాత్మక ప్రదేశాలను చూపించడం కోసం ఏర్పాటు చేసిన బస్సు యాత్రకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, CWC. చైర్మన్ శ్రీదేవి జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమాలలో భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జిల్లా SC కార్పోరేషన్ ED శ్యామసుందర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, బాలాజీ, వెంకట్ రెడ్డి, అంజయ్య, వినోద్, శాంతి ట్రాక్ అసోసియేషన్ సెక్రెటరి బోదాసు పాండు, ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరి నేతి కృష్ణ మూర్తి, యువజన సంఘాల అద్యక్షలు కరుణ్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 200 విద్యార్దులు సిబ్బంది పాల్గొన్నారు.

….DPRO. YADADRI.

 

Share This Post