ఆజాదీ కి ఆమృత మహోత్సవం కార్యాక్రమములో భాగంగా హైదరాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఓరియెంటేషన్ కార్యాక్రమము : సంస్థ మెంబర్ సెక్రెటరి వై.రేణుక, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.వి. రమేష్

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ
ప్రెస్ రిపోర్ట్. తేది:25-09-2021
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ, హైదరాబాద్ మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ సంయుక్త ఆధ్వర్యములో ప్యానల్ న్యాయవాదులు, పార లీగల్ వాలంటీర్స్, వివిధ శాఖల జిల్లా అధికారులకు 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశం అమృత ఫలాలు అందరికి అందించే ఆజాదీ కి ఆమృత మహోత్సవం  పై ఓరియెంటేషన్ కార్యాక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మెంబర్ సెక్రెటరి వై. రేణుక, ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.వి. రమేష్ నిర్వహించారు. ఈ కార్యాక్రమములో మెంబర్ సెక్రెటరి వై. రేణుక మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తముగా ప్రతి గ్రామములొ న్యాయ విజ్ఞానం మరియు న్యాయ సేవ అధికార చట్టం ప్రకారం ప్రజలకు చేకూరే లబ్దిపై అక్టోబర్ 2వ తేది నుండి నవంబర్ 14వ తేదీ దాక పార లీగల్ వాలంటీర్స్ , ప్యానల్ న్యాయవాదుల, వివిధ ప్రభుత్వ శాఖల సహాయ సహకారముతో న్యాయ సేవల అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవగాహన కార్యాక్రమాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తముగా 65 మండలాలలో 1557 గ్రామాలలో నిర్వహించుటకు 149 ప్యానల్ న్యాయవాదులు మరియు 195 పార లీగల్ వాలంటీర్లతో 65 సమూహాలుగా ప్రస్తుతము ఏర్పాటు చేయడమైనదని తెలిపి అవగాహన కార్యాక్రామాలను నిర్వహించటముపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.వి. రమేష్ మాట్లాడుతూ జ్ఞానం అందివ్వటమనేది మహా కార్యమని, ప్రస్తుత సమాజములో చట్టాలు , వ్యవస్థలు ఎంతో పగడ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నను ఇంకా అనాగరికంగా నేరాలు జరగటం సమాజానికి పెను సవాల్ అని, దీనిని రూపుమాపటములో వ్యవస్థలతో పాటు ప్రతి పౌరుడు కృషి చేయాలని, చట్టం, బాధ్యత ప్రతి పౌరుడుకి తెలిపి సమాజములో చట్టబద్దముగా నడుచుకునేటట్లు చేయాలని, ఈ కార్యాక్రమాన్ని ఒక దీక్షగ భావించి అందరూ నిస్వార్దముగా సేవలు అందివ్వాలని తెలిపారు. కార్యాక్రమములో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యం. నాగరాజు, అధనపు జిల్లా న్యాయమూర్తులు కృష్ణమూర్తి, తిరుపతి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ పరిపాలనాధికారి పి. ఆంజనేయులు, ఉమ్మడి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు, సీనియర్ సివిల్ జడ్జ్ యం. వెంకటేశ్వర్ రావు, ఎక్సైజ్ మెజిస్ట్రేట్ రాణి, మొబైల్ మెజిస్ట్రేటు కీర్తి చంద్రికా రెడ్డి , నల్లగొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మేడ మోహన్ రెడ్డి మరియు ఇతర కోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు, న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు, నల్లగొండ, భువనగిరి, సూర్యపేట జిల్లాలకు చెందిన డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సహాయక ప్రాజెక్ట్ డైరెక్టర్లు, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు, తపాలా శాఖ అధికారులు, కోపరేటివ్ సొసైటి అధికారులు, సఖి కేంద్ర సభ్యులు, సి. డబ్ల్యూ.సి సభ్యులు, స్వచ్చంద సంఘ సేవ సంస్థ నిర్వాహకులు, సభ్యులు, పారలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

ప్రపంచ చెవిటి, మూగ ధినము:
ఈరోజు ప్రపంచ చెవిటి, మూగ దినమును పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు, నల్లగొండ జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ వారి సహకారముతో నల్లగొండ పట్టణములోని పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును సందర్శించి, స్థానిక కాలనీలోని ప్రజలకు, వృద్దులకు, పిల్లలకు చెవిటి, మూగ వారు ఒంటరి వారు కారని వారి హక్కులను చట్ట బద్దంగా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లా ఆరోగ్య వారు తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వారి దృష్టికి వచ్చిన పేద చెవిటి, మూగ వారిని తగు చికిత్స అందచేయటమే కాకుండా వారికి ప్రభుత్వ కల్పిస్తున్న పథకాల అర్హతకై సదరం ద్వారా ధృవీకరణ పత్రాలను అందచేయతములో తగిన కృషి చేయాలని మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాలలో తరచూ క్యాంపులను నిర్వహించాలని సూచిస్తూ, ఎవరికైనా న్యాయ సహాయం, సలహా కావాల్సినచో న్యాయ సేవా సంస్థలను ఆశ్రయించాలని తెలిపారు. కార్యాక్రమములో చెవిటి, మూగ బాలుడి తల్లి సమర్పించిన ధరఖాస్తును పరిశీలించి, తగు న్యాయ సహాయానికై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమములో డా. నితిన్ గౌతమ్, డా, స్నిగ్ధ శివమల్లిక, డా. శైలజ, సూపర్వైజరు కిరణ్ కుమార్ మరియు వైధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post