ఆజాద్ కా అమృత్ మహోత్సవము లో భాగంగా న్యాయ సేవల అవగాహన

ఆజాద్ కా అమృత్ మహోత్సవము లో భాగంగా న్యాయ సేవల అవగాహన కార్యక్రమాన్ని
రాములుబండ గ్రామములో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు నిర్వచించారు.
 ఈ కార్యక్రమములో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగము పుట్టిన బిడ్డ నుండే హక్కులు కల్పించబడినవని, అందరూ హక్కులు సాధించు కోవడమే కాదు తప్పనిసరిగా భాద్యతలు నిర్వర్తించాలని తెలిపి, నిరక్షరాస్యత, ఆర్థికలేమి, అసమానతల వలన హక్కులు కోల్పోకుండా సమ న్యాయం, సత్వర న్యాయం, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించటానికి న్యాయ సేవా అధికార చట్టం ఏర్పడిందని, ఈ సంస్థలు జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల స్థాయిలో కోర్టులు ఎక్కడ ఉంటె అక్కడ న్యాయ సేవా సంస్థలు విధులు నిర్వర్తిస్తున్నట్లు , ఈ సేవలను ప్రజలు సద్వినియొగం చేసుకోవాల్సిందిగా తెలిపి, ఆడ పిల్లలపై అగాయిత్యాలు చేస్తే చట్టం కఠినంగా శిక్షిస్తుందని తెలిపి, గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా చట్టాలు తెలుసుకోవాలని తెలిపారు. కార్యక్రమములో ప్యానల్ న్యాయవాది ఎస్.ఆర్. ఠాగూర్ న్యాయసేవలు, క్రిమినల్ చట్టాలపై వివరించారు. కార్యక్రమములో  ఎం. పి.ఓ. మాధవరెడ్డి, ఎ. ఎస్. ఐ. యాదగిరి, గ్రామ సర్పంచ్ రూపని జయమ్మ పెద్దులు, పంచాయత్ కార్యదర్శి మమత, పారా లీగల్ వాలంటీర్లు కె. నాగయ్య, బి. రవీందర్, వార్డు సభ్యులు, అంగన్ వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share This Post