ప్రచురణార్ధం
సెప్టెంబరు 24 ఖమ్మం:
ఆజాధికా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా వాణిజ్య సప్తాహాను పురస్కరించుకొని జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామిక, ఎగుమతి దారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనుబంధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సమావేశమయ్యారు. జిల్లాలో పారిశ్రామిక రంగాలను, ఎగుమతులను మరింత అభివృద్ధి పర్చేందుకు గాను అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కావలసిన సహాకారం తదితర అంశాలపై వివిధ పరిశ్రమల అసోసియోషన్ ప్రతినిధులతో కలెక్టర్ చర్చించి వారి సమస్యలను సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించడం జరుగుచున్నదని, భవిష్యత్తులో పారిశ్రామిక రంగానికి, ఎగుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని గ్రానైట్స్ ఎక్స్పోర్ట్ అసోసియోషన్, మిర్చి ఎక్సోపోర్టు అసోసియోషన్, రైస్ మిల్లర్స్ అసోసియోషన్ ప్రతినిధులు, ప్రభుత్వపరంగా తమకు కావలసిన సహాయ సహకారాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, ఉద్యానవన శాఖాధికారి అనసూయ, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మైనింగ్ శాఖ ఏ.డి సంజయకుమార్, సంబంధిత శాఖాధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.