ఆడపిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి మహిళా, శిశు సంక్షేమ శాఖ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి

 

పత్రిక ప్రకటన

తేదీ : 28–05–2022

 

ఆడపిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి

మహిళా, శిశు సంక్షేమ శాఖ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ విషయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవసరమైన అవగాహన కల్పించాలని రాష్ట కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం వరల్డ్ మెన్సేషనల్ హైజెన్ డేకు పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ బాలికలకు కౌమారదశలో జరిగే మార్పులు, రుతుక్రమం తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు పరిశుభ్రతపై తెలియజేయడంతో పాటు బడి మానివేయటం అరికట్టాలని కోరారు  సరైన వసతులు కల్పించాలని మంత్రి తెలిపారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి,, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా సంక్షేమాధికారి, జిల్లా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు,  మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణిలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post