ఆడపిల్లలను విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ; అరికెళ్ల దేవయ్య

కమిషన్ సఆడపిల్లలను విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ భ్యుడు అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బాలల హక్కులు, సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆడపిల్లలను విక్రయించడం నేరమన్నారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న బాలల సంరక్షణ తల్లిదండ్రుల వలే చూడాలన్నారు. నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. ఐసిడిఎస్, పోలీస్, వైద్యశాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖలు బాలల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్ష చేపట్టారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా కార్మిక అధికారి సురేంద్ర కుమార్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, సిడిపివోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post