ఆడపిల్లల నిష్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఆడపిల్లల నిష్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

బుధవారం నాడు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రా ప్రియేట్ అథారిటి కమిటీ  సమావేశం (PCPNDT)  జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖి లు నిర్వహించి  కాన్పుల వివరాలను  పరిశీలించాలని ఆదేశించారు. పోలీస్ శాఖ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా నెలవారీగా తనిఖీలు చెయ్యాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు పెంచాలని సూచించారు. జిల్లాలో ఎవరు కూడా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయడం, అక్రమ ఆబారేషన్లు చేసినట్లు దృష్టి కి వస్తే  కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. కావున పుట్టబోయే శిశువు ఆడ అయినా మగ అయినా ఇద్దరూ సమానమే నని  బాలికల సంఖ్య తగిన చొ సమాజంలో అనేక ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ రామ్ మనోహర్ రావు, డా. రవీందర్ లఖావత్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇఫైకార్ అహ్మద్ మాస్ మీ డియా అధికారి  హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Share This Post