ఆడపిల్లల హక్కులపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున జిల్లా న్యాయాధికారి కార్యాలయ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవ సహకార సంస్థ ద్వారా జిల్లాలో న్యాయ సేవ సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. రాజ్యాంగం ద్వారా ఆడపిల్లలకు సంక్రమించిన హక్కులకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆడపిల్లల పట్ల ప్రేమానురాగాలు కల్పిస్తూ, వారికీ చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయ భాస్కర్ రావు, జిల్లా న్యాయ సేవ సహకార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్ పాండే, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, DLSA కార్యాలయ పర్యవేక్షుకురాలు శైలజ, కోర్ట్ సిబ్బంది, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post