ఆడపిల్ల జన్మిస్తే అదృష్టంగా భావించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

ఆడపిల్ల జన్మిస్తే అదృష్టంగా భావించాలి…

మహబూబాబాద్, జూలై-24:

సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంచేందుకు ఆడపిల్ల జన్మించగానే శుభ పరిణామంగా భావిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచేలా స్వీట్స్ అందివ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రసవాలను పెంచేందుకు పలు వినూత్న పద్ధతులు, వైద్య శాఖ కార్యకలాపాల పై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ పిల్లలు పుడితే ప్రాధాన్యత చూపాలని ప్రసవించిన మహిళకు స్వీట్స్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలపాలన్నారు.
ఆడపిల్లల ప్రాధాన్యత వివరించాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన మహిళల గురించి తెలుపుతూ వారి చిత్రాలను స్వీట్ పాకెట్ ద్వారా ముద్రించి అందజేయాలన్నారు.
కెసిఆర్ కిట్ ఆడపిల్లలకు ప్రాధాన్యత ఇచ్చిందని అదేవిధంగా ఆడపిల్లల జన్మనిచ్చిన తల్లులను అభినందించాలి అన్నారు.

గర్భిణీ మహిళ ప్రసవించే ముందుగా సైక్రియాటిస్ట్ తో ఆడపిల్ల పుట్టుక విశిష్టత తెలియజేయాలని అదేవిధంగా వారి బంధువులకు కూడా వివరించి చెప్పాలన్నారు.
ఈనెల 26వ తేదీన పుట్టిన ఆడ పిల్లలకు స్వీట్ బాక్స్ అందించే కార్యక్రమ వేడుకను పండుగలా చేపట్టాలన్నారు.
ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మార్పు అనేది ఒకేసారి రాదని వైధ్యాధికారులకు తెలియజెప్పారు.ఆడపిల్ల పుట్టుక పెంచే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలన్నారు.

జిల్లాలోని హాస్పిటల్స్ తో పాటు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాలలో కూడా కాన్పులు తప్పనిసరిగా జరగాలన్నారు కాన్పుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండాలని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.

హాస్పిటల్స్ లో మృతి చెందిన ప్రతి ఒక్కరి వివరాలతో పూర్తి నివేదిక అందించాల్సి ఉంటుంది అన్నారు.

రోగులకు అందించే భోజనం నాణ్యతతో ఉండాలన్నారు 108 వాహనాలపై వైద్యాధికారులు సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజు చేపట్టిన పనులను సమీక్షించాలి అన్నారు 108 వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేసేందుకు కోఆర్డినేటర్ తో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన అత్యంత అవసరమన్నారు అలాగే ముందస్తు అనుమతి లేనిదే సెలవులు తీసుకోరాదని తెలియజేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో లో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు బానోతు వెంకట రాములు, ఉప వైద్యాధికారి అంబరీష, ఆర్ ఎం వో రమేష్, ఎం సి హెచ్ పిఓ బిందు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post