ఆడపిల్ల పెండ్లికి అప్పులు తేవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇంటికి పెద్దగా నిలిచి ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక చేయూతనివ్వడంతో పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆనందంగా తమ కూతురు వివాహం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రచురణార్ధం

23 ఖమ్మం –

ఆడపిల్ల పెండ్లికి అప్పులు తేవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇంటికి పెద్దగా నిలిచి ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక చేయూతనివ్వడంతో పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆనందంగా తమ కూతురు వివాహం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వీ.డి.ఓన్ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 181 మంది లబ్ధిదారులకు రూ.1.81 కోట్ల విలువైన చెక్కులను నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి మంత్రి లబ్దిదారులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి వారినుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకం తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం ద్వారా పేద ఇంటి ఆడకూతురున్న తల్లిదండ్రులకు భరోసాను కల్పించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.66.02 కోట్ల రూపాయలు కల్యాణ లక్ష్మి షాది ముభారక్ పథకం కింద అందించడం జరిగిందని ఇట్టి కార్యక్రమం సంతృప్తినిచ్చిందని మంత్రి అన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహపంక్తి భోజనం చేసిన చేసారు..

కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, రఘునాథపాలెం జడ్పీ.టి.సి, మాళోతు ప్రియాంక, ఎం.పి.పి. భూక్యా గౌరీ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహశీల్దార్లు శైలకు, నర్సీంహారావు, కార్పోరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post