ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు ఆర్ధిక భారం కాకూడదనే సంకల్పంతో కళ్యాణలక్ష్మి/షాదిముబారక్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  .పువ్వాడ అజయకుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 21, ఖమ్మం

ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు ఆర్ధిక భారం కాకూడదనే సంకల్పంతో కళ్యాణలక్ష్మి/షాదిముబారక్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  .పువ్వాడ అజయకుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని పలు డివిజన్లలో 17, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36, 35, 47, 48, 46,, 14, 08, 09, 10, 7, 6, 5, 4, 3, 02, 57, 58  574 లబ్దిదారులకు రూ.3.68 కోట్ల విలువైన కళాక్షణ లక్ష్మి షాదిముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మోటారు సైకిల్పై పర్యటించి మంత్రి స్వయంగా పంపిణి చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర్ రావు నిరంతరం పేదల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి సంక్షేమానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద, నిరుపేదలైన ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహానికి అప్పులు చేసి ఆర్ధికంగా ఇబ్బందులకు గురికాకూడదనే సంకల్పంతో ఆలోచన చేసి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. -నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఖమ్మం అర్బన్ తహశీల్దారు. శైలజ, స్థానిక కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post