ఆడబిడ్డలు వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 2 (శనివారం).

ఆడబిడ్డలు వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పూల పండగ అని మహిళలు మాత్రమే పాల్గొనే ఈ బతుకమ్మ పండుగను ధనిక, పేద అనే బేధం లేకుండా మహిళలందరూ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్ని వర్గాల మహిళలు సంతోషంగా బతుకమ్మ పండగలో పాల్గొనడంతో పాటు నేత కార్మికులకు చీరలను నేయడం ద్వారా ఆర్థికంగా తోడ్పాటు నందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో సుమారు 3 కోట్ల 66 లక్షల రూపాయల విలువగల చీరలను 1లక్షా 43 వేల మంది మహిళలకు రానున్న నాలుగు, ఐదు రోజుల్లోగా పంపిణీ పూర్తి చేస్తామని, మహిళలందరూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు స్వీకరించి ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎంఎల్ఎ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలలో రేషన్ షాప్ ల ద్వారా రెవెన్యూ, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ తదితర శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి, జెడ్పి వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ, ఎంపీపీ మందల లావణ్య, జెడ్పీ సీఈవో శోభారాణి, డిఆర్డిఓ పురుషోత్తం, డిపిఓ ఆశాలత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post