ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.

ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.

తొర్రూరు (మహబూబాబాద్ జిల్లా) అక్టోబర్ 3.

తెలంగాణ పండుగ బతుకమ్మ కు వచ్చే ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఆదివారం తొర్రూరు జడ్.పి. హైస్కూల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పంపిణీ చేశారు . కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు బతుకమ్మ పండుగను రాష్ట్రమంతటా వేడుకలా జరపాలని ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు.

తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి సాంప్రదాయంలోని గొప్పతనాన్ని మరింత చాటేందుకు మహిళలను గౌరవించుకుంటూ పుట్టింటి సారెగా రూ 333.14 కోట్లతో బతుకమ్మ చీరలను రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతతో ప్రతి మహిళకు అందే విధంగా కృషి చేయాలన్నారు. కులవృత్తులను ప్రోత్సహించాలని చేనేత పరిశ్రమకు చేయూత అందివ్వాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో 11. 25 కోట్లతో జిల్లా లో నెంబర్ వన్ గా పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నా మన్నారు. అమ్మపురం రహదారి, అభివృద్ధి కంఠాయపాలెం డబల్ రోడ్డు, హరిపిరాల రోడ్డు విస్తరణ, మోడల్ మార్కెట్ నిర్మాణం, యతి రాజారావు పార్కు వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిన నిరుపేదలకు అమలుపరిచే పథకాలకు ఆటంకం జరుగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిధులు తీసుకొచ్చి ఆసరా పెన్షన్ లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలను అమలు పరిచారన్నారు. కరోనా వచ్చిన వారిని స్వయంగా ఆదుకునేందుకు తన ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని అన్నారు. మాస్కులను ఉచితంగా సరఫరా చేయడం జరిగిందని అదేవిధంగా 25 లక్షలతో అంబులెన్సులు కూడా స్వయంగా తన సొంత నిధులతో సమకూర్చనున్నారు. కరోనా సమయంలో 50 లక్షల రూపాయల విలువైన ఆనందయ్య మందును కూడా ఉచితంగా పంపిణీని చేయడం జరిగిందని అన్నారు. కరోనా వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, హైదరాబాదులోని పలు ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించామన్నారు.

కరోనా వచ్చిన వారికి కూడా అండగా నిలబడతామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ తొర్రూర్ లో 6,600 మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మండలం మొత్తం మీద 27 వేల మందికి చీరలు అందజేస్తున్నామన్నారు.

అంతకు ముందు మంత్రి కి సాయి కృష్ణ కోలాటం బృందం బతుకమ్మలతో ఎదురేగి స్వాగతం పలికారు. మంత్రి జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి కోలాటమాడి మహిళలకు స్ఫూర్తి కల్పించారు.

12 అడుగుల మెగా బతుకమ్మ తో పూలను వెదజల్లుతూ మంత్రికి తొర్రూరు నుండి వెలిశాల వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం వెలికట్ట లో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహిళలకు చీరలను, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను స్వయం సహాయక మహిళలకు 7 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో తొర్రుర్ మునిసిపల్ చైర్మన్, వెలికట్ట గ్రామ సర్పంచ్ పుష్పాలీల, ఎంపీపీ అంజయ్య జడ్పిటిసి శ్రీనివాస్ జడ్పీ సీఈఓ రమాదేవి ఆర్డీవో రమేష్ డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్యా, కాకిరాల హరిప్రసాద్, తాసిల్దార్ రాఘవ రెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————–

Share This Post