ఆత్మకూరు, అమరచింత మండలాల్లో చేనేత కార్మికుల స్థితిగతులు, చేనేత పార్క్ నూ పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన                                  వనపర్తి, Date:3.8. 2021

చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
మంగళవారం జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో చేనేత కార్మికుల స్థితిగతులు, చేనేత పార్క్ నూ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. చేనేత కార్మికులను యజమానులుగా చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నాలుగు వందల మంది చేనేత కార్మికులను గుర్తించడం జరిగిందన్నారు. వారి కి ఉపాధి కల్పించేందుకు గాను యూనిట్లను ఏర్పాటు చేసి మిషన్లను ముడి సరుకును ఇప్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా సిల్క్ చీరలు తయారీ ఇతర చేనేత వస్త్రాల తయారీకి త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు చేనేత పార్క్ ద్వారా కాక ఇంకా వ్యక్తిగతంగా చీరలు తయారు చేసి చేనేత కార్మికులకు ముడిసరుకు అందజేయడం జరుగుతుందన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి చేనేత ఉత్పత్తులు తయారు చేయాలని వాటిని మార్కెట్ చేయడం ఆన్ లైన్ ద్వారా, ప్రైవేట్ హోల్సేల్, షాపింగ్ మాల్ వారు నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటివరకు రూ.2 కోట్లు ఖర్చు చేసే మెషిన్ లు తేప్పించడం జరిగిందన్నారు. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇందులో టైలరింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గార్మెంట్స్ తదితర ఉత్పత్తులను కూడా తయారు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారి తోపాటు చేనేత కార్మికులు సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయనైనది.

Share This Post