ఆత్మకూరు పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
28 7 2021
వనపర్తి

ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించేందుకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,57,404 రేషన్ కార్డులు ఉన్నాయని వీటి ద్వారా 5లక్షల 57 వేల మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతం కొత్తగా ఆత్మకూరు మండల పరిధిలో 346 కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు. పాత కార్డు దారులకు 15 కిలోల బియ్యం అందజేస్తారని తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బహుళ ప్రయోజన మైన రేషన్కార్డులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవి కుమార్,ఎంపిపి బంగారు శ్రీనివాస్, జడ్పిటిసి శివరంజని, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రమేష్ ,అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు….. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయనైనది.

 

Share This Post