ఆత్మకూరు మండలంలోని బాలకృష్ణపూర్, మదనాపురం గ్రామాలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గోన్నజిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి

పత్రికా ప్రకటన                                           తేది:6.7. 2021
వనపర్తి

పచ్చదనంతో పల్లెసీమలు వెళ్ళువిరియాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
మంగళవారం ఆత్మకూరు మండలంలోని బాలకృష్ణపూర్, మదనాపురం గ్రామాలలో జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి    జిల్లా కలెక్టర్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం ద్వారా గ్రామాలలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, రోడ్లు డ్రైనేజీ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత ద్వారా గ్రామాలలో ఎప్పటికప్పుడు రోడ్లు, డ్రైనేజీలు పరిశుభ్రత పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సూచించారు. హరితహారం ద్వారా జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నామని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలకు రహదారులు, వైకుంఠధామం, డంప్ యార్డ్ లు, ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందని వివరించారు. గ్రామాల అభివద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్, జిల్లా అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
….. ………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారి చేయనైనది.

Share This Post