ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ – అదనపు కలెక్టర్- ఎస్. మోతిలాల్

పత్రిక ప్రకటన
తేదీ 26.09.2022

నాగర్ కర్నూలు జిల్లా

ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ – అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చిట్యాల (చాకలి) ఐలమ్మ తెలంగాణ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ అన్నారు.
సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ….
నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని ఆయన అన్నారు.
తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని అదనపు కలెక్టర్ అన్నారు. హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం పోరాడిన దీరవనిత రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరూ వారి స్ఫూర్తిని పొంది ముందుకు సాగాలన్నారు.
అంతకుముందు వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు..
లెక్చరర్ నరసింహులు మాట్లాడుతూ ముఖ్యంగా నాగర్ కర్నూల్ ట్యాంక్ బండి పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజల సమక్షంలో ఐలమ్మ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఐలమ్మ పేరుపై మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాను ఐలమ్మ జిల్లాగా పెట్టాలని డిమాండ్ చేశారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి,నాగర్ కర్నూలు డిఎల్పిఓ రామ్మోహన్రావు, వివిధ ప్రజా సంఘ నాయకులు నరసింహులు, కవి వనపట్ల సుబ్బయ్య, టీచర్ మల్లేష్, ఆటో శేఖర్ నవీన్ కుమార్, బాలస్వామి, ల్యాండ్రీ మల్లేష్, ఫోటో శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post