ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకెళ్లాలి – జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య

అంగ వైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పెద్దపల్లి పద్మావతి బంగారయ్య అన్నారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా నాగర్ కర్నూల్ జిల్లా లోని దివ్యాంగులకు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య శుభాకంక్షలు తెలిపారు.
దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఆమె తెలిపారు.
శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…..
దివ్యాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కు భద్రత గౌరవం అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు చర్యలు చేపట్టాలని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రభుత్వం నుండి వారికి అందవలసిన ప్రతి అంశాన్ని సంక్షేమ శాఖ అధికారిని ప్రత్యేక చొరవ తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె కోరారు.
దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
అంతకుముందు నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ…
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
దివ్యాంగులు పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ లక్ష్యాన్ని సాధించడంలో ఉన్నత శిఖరాలను ఆదరించడం లో ఎవరికీ తక్కువ కాదని ప్రతి ఒక్కరూ చదువుకుంటే అన్ని రంగాల్లో రాణించడం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా దివ్యాంగులకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై దివ్యాంగులకు తెలియజేశారు.
దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ…
ఎన్ని సమస్యలు చెప్పిన ప్రభుత్వం నుండి పరిష్కారం కావడం లేదని అన్నారు.
ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఫలితం శూన్యం గా ఉందన్నారు.
ఉన్నతాధికారులు తప్పనిసరిగా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు.
దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్ మాట్లాడుతూ…
వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తూ దివ్యాంగుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలి అన్నారు.
దివ్యాంగుల చట్టాలను పకడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దివ్యాంగులకు ప్రభుత్వం నుండి అందాల్సిన అంశాలపై అధికారులు స్పష్టత ఇచ్చేలా చూడాలన్నారు.
అంతకుముందు సంక్షేమ శాఖ అధికారి వెంకట లక్ష్మి మాట్లాడుతూ …
దివ్యాంగులు అధైర్య పడకుండా తెలివితేటలను ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
దివ్యాంగులు సేవలందిస్తున్న పలువురిని దివ్యాంగులు అయినా ఉపాధ్యాయుడు రవికుమార్,
గంధం ప్రసాద్, నారాయణమ్మ, నిరంజన్, లక్ష్మణ్ రావు తదితరులను చైర్మన్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివేకనంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు లక్ష్మణరావు, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి బలేశ్వర్ , ఎన్ పి ఆర్ డి ఇండియా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, కొల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునందన్ రెడ్డి గంధం ప్రసాద్ నారాయణమ్మ మురళి రాకేష్ శంకర్ మురళి సైదులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post