ఆత్మస్థైర్యం తో ఆడపిల్లలు ముందడుగు వేయాలి

ప్రచురణార్ధం

ఆత్మస్థైర్యం తో ఆడపిల్లలు ముందడుగు వేయాలి.

మహబూబాబాద్, నవంబర్,20.

ఆత్మస్థైర్యంతో ఆడపిల్లలు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు

ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆడపిల్లలు 50 శాతం భయాందోళన లతోనే చదువులో వెనకడుగు వేస్తారని ఇది సరికాదన్నారు.
ఆత్మస్థైర్యంతో ముందడుగు చూసేందుకు క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు.
అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని ఆటపాటలతో భయాలను వదిలి ముందడుగు వేయాలన్నారు ఆడపిల్లలు మానసికంగా ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని రక్షణ కూడా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయని తెలియజేశారు. ఆడపిల్లలకు రక్షణగా టోల్ ఫ్రీ నెంబర్ ఉందని 1098 అలాగే సఖి సెంటర్ కూడా మహిళల కొరకు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు.

ఏ ఎస్పి యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ తాను కూడా బాల్యంలో వసతి గృహం లోనే ఉండి విద్యనభ్యసించానన్నారు.
వసతి గృహ అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు శునకం లాగా విశ్వాసం పెంపొందించుకోవాలని, కొంగలాగా ధ్యానం , అల్పాహారం తీసుకుంటూ కాకి లాగా ప్రయత్నాలు చేస్తూనే రాణించాలన్నారు.
అనంతరం చిన్నారు లు ప్రదర్శించిన నృత్యాలు, మ్యాజిక్ షో,
శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్న చిరు తేజ సింగ్ మ్యాప్ ఆధారంగా 196 దేశాల పేర్లు చెప్పడం కలెక్టర్ ఆశ్చర్యపోయారు.
విద్యార్థినిలు కలెక్టర్ కు రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు బాల బాలల దినోత్సవం పురస్కరించుకొని
చిన్నారుల మధ్య కేకును కట్ చేసి చిన్నారిని ఎత్తుకున్నారు అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగ వాణి కళాశాల ప్రిన్సిపల్ రూపాదేవి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, సి డి పి వో లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post