ఆత్మ విశ్వాసంతో కదిలితే ఏదైనా సాధించొచ్చునని, లక్ష్యంతో చదవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు విద్యార్థులకు తెలిపారు.

సిద్ధిపేట 01 జూన్ 2022 :

ఆత్మ విశ్వాసంతో కదిలితే ఏదైనా సాధించొచ్చునని, లక్ష్యంతో చదవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
పట్టణంలోని వడ్డేపల్లి దయానంద్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రతిభ డిగ్రీ, పీజీ కళశాలకు ఐఎస్ఓ సర్టిఫికేట్, జెండర్ సెన్సిటైజేషన్ సర్టిఫికేట్ లభించిన సందర్భంగా పత్రాలను రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రతిభ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐఎస్ఓ సర్టిఫికేట్, జెండర్ సెన్సిటైజేషన్ సర్టిఫికేట్ లభించిన సందర్భంగా ప్రతిభ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు. విద్యార్థుల భవిష్యత్తుకై ఆలోచించే అరుదైన వ్యక్తి సూర్యప్రకాష్ అని కొనియాడారు.
ఫిజిక్స్ వాలా ప్రతినిధులు తన వద్దకు వస్తే డిజిటల్, ఫిజికల్ క్లాసులు ఉచిత శిక్షణకై సిద్ధిపేట ప్రతిభ డిగ్రీ కళాశాల పేరును ప్రతిపాదించామని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో టాప్ 100లో 11 సీట్లు తెలంగాణకే వచ్చాయని, కొండపాకలోని వారి ఇంట్లో నుంచే
అఖిల్ యాదవ్ చదివి ర్యాంకు సాధించారని వివరించి ప్రతిభ కళాశాల విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. 2ఐ ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో మీకు శిక్షణ ఇప్పిస్తానని భరోసా కల్పించారు.
కార్యక్రమంలో లీడ్ ఇండియా సంస్థ ప్రతినిధులు రంజిత్, ఐఎస్ఓ సంస్థ ప్రతినిధి శివయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post