ఆదర్శవంతమైన అంగన్వాడీలుగా ఎదగాలి …… రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ……….భారతి హోలికేరి

అభివృద్ధికి ముఖ్యమైన మానవ సంపదను అందించాలి

పిల్లలకు మంచి విద్యను కాలుష్యం, కల్మషం లేని వాతావరణాన్ని అందించాలి

పూర్వ ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయవద్దు

పునాది బాగుంటేనే మంచి పౌరులుగా తయారవుతారు

ఆదర్శవంతమైన అంగన్వాడీలుగా ఎదగాలి ……
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్
……….భారతి హోలికేరి

అభివృద్ధికి ముఖ్యమైనది మానవ సంపదని, మన పిల్లలకు మంచి విద్య , కాలుష్యం, కల్మషం లేని వాతావరణాన్ని అందించాలని అప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలికెరి అన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అంగన్వాడీ టీచర్ల పూర్వ ప్రాథమిక విద్యా సదస్సును నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీ హోళికేరి మాట్లాడుతూ
అంగన్వాడి టీచర్లను భాగస్వాములను చేసి
జిల్లాస్థాయి పూర్వ ప్రాథమిక విద్యా సదస్సు నిర్వహించడం ఎక్కడ చూడలేదని,ఇది చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అభివృద్ధికి ముఖ్యమైనది మానవ సంపదని, మనిషికి కావాల్సింది మంచి ఆరోగ్యం, విద్య అవసరమన్నారు. మన పిల్లలకు మంచి విద్యను,కాలుష్యం,
కల్మషం లేని
వాతావరనాన్ని అందిస్తే చాలన్నారు.అప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందన్నారు. పిల్లవాడికి చదువుకు సంబంధించి పునాది బాగుంటే మంచి పౌరులుగా తయారవుతారన్నారు.వారి భవిష్యత్తు బాగుండేలా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యను నేర్పించాలని తెలిపారు. బోధించడం కన్న గొప్ప వృత్తి ఏదీ లేదన్నారు. అంగన్ వాడి టీచర్లు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో మంచి పునాది పడుతుందని, అప్పుడే మంచి
సమాజం ఏర్పడుతుందన్నారు.

అంగన్వాడి టీచర్లు హెల్పర్లు తలుచుకుంటే అన్ని సాధించవచ్చున్నారు. సమస్యలు సమస్యగా గుర్తించి పరిష్కారం ఆలోచించి గురుతర బాధ్యత తో, ఆరోగ్యవంతమైన పోటీ తో పని చేయాలని సూచించారు.

గ్రామపంచాయతీతో సమన్వయం చేసుకుని కాలుష్య నివారణకు తోడ్పడాలన్నారు.

బాల్య వివాహాల ను పూర్తిస్థాయిలో నివారించాలని, మహిళలు పిల్లల హక్కులను కాపాడితే కల్మషం లేని సమాజం ఏర్పడుతుందని అన్నారు. ఆదర్శవంతమైన అంగన్వాడీలు గా ఎదగాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా మిగితా జిల్లాలకు ఆదర్శం కావాలన్నారు.

ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సిబ్బంది , అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్, విప్రో ఫౌండేషన్ ప్రతినిధులను ఆమె అభినందించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ఒక గ్రామం ఆదర్శవంతంగా ఉందంటే అక్కడ అంగన్వాడి బాగా పనిచేస్తుందని చెప్పవచ్చన్నారు. సెమినార్లు చెప్పిన అంశాలను అంగన్వాడీ టీచర్లు తమ తమ కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. ప్రతి పౌరుడి పునాది అంగన్వాడీలోనే ఉందన్నారు.తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుందని
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు చిన్నారుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రీస్కూల్ విద్యను అందిస్తున్న మన అంగన్వాడీ కేంద్రాలకు ఏ ప్లే స్కూల్ కూడా సాటిరాదన్నారు.జిల్లాలో స్యా మ్, మామ్ పిల్ల ల నిష్పత్తి జీరో గా మారాలని సూచించారు.పనితీరు మరింత మెరుగు పరచుకుని పని చేయాలని సూచించారు.

అనంతరం పోషణ పక్షం పోస్టర్లను ఆవిష్కరించారు.

విప్రో ఫౌండేషన్ ప్రతినిధులు అందించిన ప్లే స్కూల్ మెటీరియల్ ను అంగన్వాడి కేంద్రాల టీచర్ల అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పద్మావతి, అజీమ్ ప్రేమ్ జీ రాష్ట్ర ప్రతినిధి ఎం శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి యోగేష్, విప్రో ఫౌండేషన్ ప్రతినిధులు రామకృష్ణ, మీనా, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post