ఆదర్శ సమాజాన్ని నిర్మించడం భారత రాజ్యాంగ లక్ష్యం. రాజ్యాంగ స్ఫూర్తి తో ముందుకెళ్లాలి.:: అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

అసమానతలు, వివక్ష లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం భారత రాజ్యాంగ లక్ష్యమని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్ నందు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం పునాదులుగా  భారత రాజ్యాంగం జాతి జనులకు రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బoదితో  ప్రతిజ్ఞ చేయించారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రామారావు నాయక్,పి.డి. ఐసీడీస్ జ్యోతి పద్మ, శిరీష,శంకర్, శ్రీధర్, దయానంద రాణి, తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, ఏ.ఓ శ్రీదేవి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, పులి సైదులు, tngos సెక్రటరీ దున్న శ్యామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post