ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:20. 10 .2021 .
వనపర్తి.

రామాయణాన్ని మధురకావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు, ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని, వాల్మీకి సంస్కృతంలో మొట్టమొదట గొప్ప కావ్యాన్ని మనకు అందించారని జిల్లా కలెక్టర్ వివరించారు.
సమాజ ఉద్ధరణకు ఎలాంటి సాహిత్యం కావాలో, అలాంటి సాహిత్యాన్ని ఉత్తమమైన రీతిలో విశ్వమానవునికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని ఆమె అన్నారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, గొప్పగా ఎదగాలని, ధర్మమార్గాన్ని, వాల్మీకి బోధనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఆమె సూచించారు. పట్టణ ప్రజలకు జిల్లా కలెక్టర్ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి పి.కేశవులు, రాష్ట్ర అధ్యక్షులు రామ్మూర్తినాయుడు, వేణుగోపాల్, జిల్లా నాయకులు విజయ్ కుమార్, ఇంగ్లం తిరుమల, పి. రవికుమార్, బైలు శ్రీను, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వాల్మీకి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయబడినది.

Share This Post