ఆగష్టు 15, 2021 – ఆదిలాబాదు:-
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ ను పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రుణమాఫీ పథకం 2018 కింద 50 వేల లోపు ఋణం కలిగి ఉన్న 9371 రైతులకు 33.39 కోట్ల రూపాయల విలువగల చెక్కును ముఖ్య అతిథి వ్యవసాయ అధికారులకు అందజేశారు. అనంతరం శకటాల ప్రదర్శన, పోలీసు ఉద్యోగుల విన్యాసాలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 240 ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, పోలీస్ లకు మెడల్స్ అందజేశారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలచే ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ శకటాలు ప్రదర్శించిన శాఖలలో మొదటి ఎస్సీ కార్పొరేషన్, రెండవ బహుమతి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మూడవ బహుమతి మిషన్ భగీరథ, ప్రత్యేక బహుమతి ఆదిలాబాద్ మున్సిపాలిటీ కి ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్తమ బహుమతి ఇంటింటా ఇన్నోవేటర్, రెండవ బహుమతి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మూడవ బహుమతి మెప్మా కు ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు పాఠశాలల వారీగా ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే లు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, మునిసిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అధికారులు,ప్రజా ప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.