ఆదిలాబాద్ పట్టణంలో సుందరీకరణ పనులు చేపడుతున్నాం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 22, 2021ఆదిలాబాదు:-

ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా డివైడర్ ల మధ్యలో మొక్కలను నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున స్థానిక కలెక్టరేట్ చౌక్ వద్ద మీడియన్ లలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 12 కిలోమీటర్ల మేర 36 కోట్లతో డివైడర్ ల పనులు, సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, సుందరీకరణ కోసం మొక్కలు నాటడం జరుగుచున్నదని తెలిపారు. గ్రీన్ బడ్జెట్ కింద సుమారు కోటి యాభై లక్షల రూపాయలు మున్సిపల్ నిధుల నుండి వెచ్చించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా సుందరంగా జంక్షన్ ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, ట్రీ పార్క్ లు, మొబైల్ టాయిలెట్ లు ఏర్పాటు చేయడం జరుగుచున్నదని తెలిపారు. ఆదిలాబాద్ నియోజక వర్గ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, పట్టణంలో 55 నుండి 60 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మావల నుండి చాంద వరకు 46 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులు, 4.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ నిధుల నుండి గ్రీన్ బడ్జెట్ నిధులతో పట్టణంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతున్నదని తెలిపారు. పట్టణంలోని కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వివేకానంద చౌక్, వినాయక్ చౌక్, శివాజీ చౌక్ వంటి ముఖ్య కూడళ్ళలో జంక్షన్ లను ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ కమీషనర్ శైలజ, మున్సిపల్ ఈఈ టి.వెంకట సుబ్బయ్య, డిఇ ఎం.తిరుపతి, ఏఈ అరుణ్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ రాజేందర్ నాయక్, ఈఈ నర్సయ్య, డీఈ సురేష్, జెఈ శ్వేతా, కౌన్సిలర్ లు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post