ఆదివారం ఖమ్మం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ సుమారు 2 కోట్ల 64 లక్షల విలువైన ఆర్ధిక సహాయాన్ని లబ్దిదారులకు అందజేశారు.

ప్రచురణార్ధం

ఆగష్టు, 15 ఖమ్మం:

ఆదివారం ఖమ్మం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ సుమారు 2 కోట్ల 64 లక్షల విలువైన ఆర్ధిక సహాయాన్ని లబ్దిదారులకు అందజేశారు. ఖమ్మం జిల్లాలోని 33,575 మంది రైతులకు ఋణమాఫీ క్రింద 106.88 కోట్లు, 2021-22 సంవత్సరంలో బ్యాంకు లింకేజి క్రింద కోటి 88 లక్షలు, అదేవిధంగా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పి.ఎం.ఎఫ్. ఎం.ఇ) పథకం క్రింద జిల్లాలోని 142 మంది సభ్యులకు 56 లక్షల 57 వేల రూపాయల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేస్తారు.

జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు.యస్.వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి లక్ష్మీప్రసన్న, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post