ఆదివాసీ గిరిజన సమ్మేళనం ప్రచార గోడపత్రికను ఆవిష్కరంచిన కలెక్టర్ హరీశ్,

 

పత్రిక ప్రకటన

తేదీ : 15–09–2022

ఆదివాసీ గిరిజన సమ్మేళనం ప్రచార గోడపత్రికను ఆవిష్కరంచిన కలెక్టర్ హరీశ్,
హైదరాబాద్కు తరలివెళ్ళేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి,
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఈనెల 17న హైదరాబాద్లో నిర్వహించనున్న ఆదివాసీ గిరిజన సమ్మేళనంకు సంబంధించిన గోడపత్రిక (వాల్పోస్టర్ను) కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఈనెల 17న హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమురమ్ భీమ్ ఆదివాసీ భవనాన్ని, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్ళేందుకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్టీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సభ్యులను ఇప్పటికే ఎంపిక చేశామని అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వెళ్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10 లో నిర్మించిన కొమరమ్ భీమ్ ఆదివాసీ భవనంతో పాటు సేవాలాల్ బంజారా భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని కలెక్టర్ హరీశ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో ఎస్టీ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ హరీశ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు , జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post