*ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ధార్మిక క్షేత్రం మరింత అభివృద్ధికి తగిన చర్యలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ధార్మిక క్షేత్రం మరింత అభివృద్ధికి తగిన చర్యలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*దేవస్థానంలో, పట్టణ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మరింతగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, బద్దిపొచమ్మ దేవస్థానం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, గుడి చెరువు విస్తరణ, భక్తులకు వసతి కోసం చేపట్టాల్సిన చర్యలపై రూపొందించిన మాస్టర్ ప్లాన్ చార్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో నీటి వసతి, పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో రోడ్లు ప్రతీరోజూ మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేసేలా చూడాలని అన్నారు. మున్సిపల్ లో ఉన్న మొత్తం 106 మంది పారిశుద్ధ్య సిబ్బందికి వారం రోజుల్లోగా బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేసేలా చూడాలని, వారి యొక్క హాజరు వివరాలను ప్రతీరోజూ ఉదయం 8 గంటల వరకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే వేములవాడ పట్టణ పరిధిలో ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ధార్మిక క్షేత్రం మరింత అభివృద్ధికి తగిన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, వేములవాడ ఆర్డీఓ వి. లీల, మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, ఈఓ కృష్ణ ప్రసాద్, తహశీల్దార్లు మునీందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post