ఆనాద పిల్లలకు నెనున్నానని భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

ఆనాద పిల్లలకు నెనున్నానని భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

జిల్లా కలెక్టర్ హరిచందన శుక్రవారం రాఖి పౌర్ణమి సందర్భంగా  జిల్లా కేంద్రం లోని వయోవృద్ధుల గృహం లో ఉన్న ఆనాద పిల్లల మద్యలో రాఖీ పండగ జరుపుకున్నారు. కార్తీక్ అనే విద్యార్ధి కి జిల్లా కలెక్టర్ రాఖి కట్టి శుభకంక్షలు తెలిపారు. అక్కడ ఉన్న ఉన్న విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు రాఖి కట్టారు. విద్యార్థులకు మిటాయిలు, చాక్లెట్లు పంపిణి చేసి మీరు ఎవరు అనాధాలు కారని మీకు అండగా నేను ఉన్నానని, ఏ సమస్య వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని భరోసా కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం భారం బావి సందర్శించి విద్యార్ధు లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. వజ్రోత్సవాలలో భాగంగా 16వ తేదిన నిర్వహించబోతున్న సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమన్ని భారం బావి దగ్గర నిర్వహించాలనుకున్న సందర్భంగా పరిసరాలను పరిశీలించి పరిసరాలను శుబ్రపరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో DWO వేణుగోపాల్, కుసుమ, నిహారిక, కరిష్మా, తిరుపతయ్యా, మున్సిపల్ కమిషనర్ సునీత, AE మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post