జిల్లా నలుమూలల నుండి వైద్య కోనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆనుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆనుషత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్, ఈ. ఈ. కుమార్ లతో కలిసి ఆనుపత్రిలోని వార్డులు, పరినరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆనుపత్రికి వచ్చే రోగులతో పాటు ఇన్పేషేంట్స్గా చికిత్స పొందుతున్న వారితో ఆనుషత్రి వైద్యాధికారులు, సిబ్బంది స్నేహపూర్వకంగా మెదలాలని, తప్పనినరిగా నమయపాలన పాటిన్లూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. చిన్న పిల్లల కోనం 20 పడకలతో ఒక వార్డు, దీర్ధక్రాలిక వ్యాధుల చికిత్స కోనం ఎన్.సి.డి. ప్రత్యేక వార్డుల ఏర్పాటు కోనం పనులు చేపట్టడం జరుగుతుందని, త్వరలోనే సేవలు అందుబాటులో తీనుకురావడం జరుగుతుందని తెలిపారు. ఆనుషత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ నక్రమంగా లేకపోవడంతో దుర్వానన వెదజల్లడంతో పాటు అపరిశుభ ఆవరణ ఉండటంతో అధికారులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వెలిబుచ్చడంతో పాటు ఇద్దరు పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు యాకూబ్, అనిల్ లను విధులు నుండి తొలగించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోనం నిబ్బందికి విడతల వారిగా విధులు కేటాయించి నంబంధిత అధికారులు, పనులను పర్యవేక్షిన్తూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.