ఆప్యాయంగా పలకరిస్తూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ… – బిజీ షెడ్యుల్ లోనూ రగుడులో 50 నిమిషాల పాటు ప్రజల మధ్యలో మంత్రి

ఆప్యాయంగా పలకరిస్తూ..
యోగక్షేమాలు తెలుసుకుంటూ…

– బిజీ షెడ్యుల్ లోనూ రగుడులో 50 నిమిషాల పాటు ప్రజల మధ్యలో మంత్రి

మంగళవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణ పర్యటనలో చివరగా మంత్రి శ్రీ కే తారక రామారావు రగుడు
మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం ను ప్రారంభించారు. కేంద్రం సమీపంలోనే కిచెన్ గార్డెన్ ను మంత్రి ప్రారంభించారు.

అంతకుముందు రాగుడు అంగన్వాడి కేంద్రానికి వెళ్ళే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ఒక్కొక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం కోసం విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. మంత్రి చాలా సమయం తమతో వెచ్చించి తమ బాగోగులు అడిగి తెలుసుకోవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు రాజీవ్ నగర్ బస్తీ దవాఖానా ప్రారంభం అనంతరం స్థానిక పిల్లలతో ముచ్చటించారు.
పర్యటనలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు, యువత, పిల్లలు సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేయగా ఎవ్వరినీ నిరాశ పరచకుండా మంత్రి సెల్ఫీ దిగి వారి దిల్ ఖుష్ చేశారు.

మంగళవారం మంత్రి పర్యటన ఆద్యాంతo పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.

Share This Post