ఆప్యాయతకు పేరు అంగన్ వాడి కేంద్రాలు…

ప్రచురణార్థం

ఆప్యాయతకు పేరు అంగన్ వాడి కేంద్రాలు…

మహబూబాబాద్ అక్టోబర్ 9.

అంగన్వాడి కేంద్రాల్లో స్నేహ పూరిత వాతావరణాన్ని మరింత పెంచేందుకు ఆప్యాయతను అందించే దిశగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనిన తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలలో స్నేహపూరిత వాతావరణం కల్పించేందుకు పదిమంది అంగన్వాడి టీచర్లకు చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలు అమ్మ దగ్గర లభిస్తున్న ఆప్యాయతను అందిస్తూ మరింతమంది కేంద్రాలకు వచ్చే విధంగా అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టి అవగాహన పరుస్తున్నామన్నారు.

శిక్షణ కార్యక్రమానికి కావలసిన సామాగ్రిని అందజేసేందుకు కమిషనరేట్ నుండి ఈ సి సి ఈ ఇన్చార్జిగా పని చేస్తున్న శ్రీమతి కొండా రమ న్యాయవాది అయిన తన తండ్రి సాయి రెడ్డి జ్ఞాపకార్థం 10 మోడల్ కేంద్రాలకు 60 వేల విలువ గలిగిన వస్తువులను అందించినట్లు తెలియజేశారు.

అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు చేపట్టిన శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి అంగన్వాడి కేంద్రాలను అభివృద్ధి పరుస్తున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ సి డి పి వో లు సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post