ఆబాది జమ్మికుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిట్ల ఐలయ్య రైతుదిగుండె పోటుతో ఆకస్మిక మరణం అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ఆబాది జమ్మికుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిట్ల ఐలయ్య రైతుదిగుండె పోటుతో ఆకస్మిక మరణం

అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

000000

తేది.07-12-2021 మంగళవారం రోజున ఆబాది జమ్మికుంట వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో బిట్ల ఐలయ్య (70) సంవత్సరాల రైతు తన ధాన్యాన్ని గన్నీ సంచులలో నింపే సమయంలో గుండె పోటు రావడం వల్ల ఆకస్మిక మరణం చెందినారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తెలిపారు.

ఆబాది జమ్మికుంట ధాన్యం కొనుగోలు కేంద్రానికి బిట్ల ఐలయ్య డిసెంబర్ 4 న 10-10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి డిసెంబర్ 6 న 1877 నెంబర్ గల టోకెన్ జారీ చేయడం జరిగిందని, అదే రోజు రైతుకు 40 గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తేది. 07-12-2021 మంగళవారం రోజున బిట్ల ఐలయ్య కొనుగోలు కేంద్రానికి వచ్చి తన ధాన్యాన్ని గన్నీ సంచులలో నింపే సమయంలో గుండె పోటు రావడం వలన అకస్మిక మరణం పొందారని, ఇట్టి విషయంలో కొనుగోలు కేంద్రం సెంటర్ ఇంచార్జిది కానీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి ది కానీ ఎలాంటి తప్పు లేదని ఆయన తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ జమ్మికుంటకు నాలుగు కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. తేది. 20-10-2021 రోజు నుండి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఆబాది జమ్మికుంటలో ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల ఇప్పటి వరకు 106 మంది రైతుల నుండి 10,603 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 1000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉందని ఆయన తెలిపారు.

మంగళవారం ఆబాది జమ్మికుంట వరి ధాన్యం కేంద్రంలో బిట్ల ఐలయ్య రైతు మరణించిన సంఘటనపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్ పెక్టర్ (ఫీల్ద్) ప్రసూనతో విచారణ జరిపించగా రైతు గుండె పోటుతోనే ఆకస్మిక మరణం పొందినారని, ఇట్టి విషయంలో కొనుగోలు కేంద్రం ఇంచార్జిది కానీ, ముఖ్య కార్య నిర్వహణ అధికారిది గానీ ఎలాంటి తప్పు లేదని ఆమె నివేదిక సమర్పించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

 

Share This Post