ఆముదం బండ తాండ, షాపూర్, బలిజేపల్లి గ్రామపంచాతీల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన                 తేది:12 8 2021
వనపర్తి.

తెలంగాణ ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నదని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు.
గురువారం జిల్లా పరిధిలోని కర్నే తాండ, షాపూర్ గ్రామాల మధ్య గల స్థలాన్ని పరిశీలించి బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఆమె పరిశీలించారు. ఘనపూర్ మండలంలోని ఆముదం బండ తండ, షాపూర్, పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామాలలోని బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఆమె పరిశీలించారు. వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో, 5 మున్సిపాలిటీలలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఐదెకరాల స్థలాలలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. షాపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన నర్సరీ, ప్లాంటేషన్, టేకు, వేప, రావి, పండ్ల మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ వెంట సీఈవో వెంకట్ రెడ్డి, ఏ.పీ.డి. ( డి.ఆర్.డి.ఎ) కృష్ణయ్య, ఘనపూర్, పెద్ద మందడి ఎంపీడీవోలు, ఎం పి టి. కృష్ణా నాయక్, ఏ పీ ఓ లు పంచాయతీ సెక్రటరీలు, పెద్దమందడి సర్పంచ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారి చేయనైనది.

 

Share This Post