You Are Here:Home→ఆయకట్టు ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించాలి* # *ఉపాధి హామీ పథకం పనుల పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్* *మిర్యాలగూడ,వేముల పల్లి మండలం లలో పర్యటించిన కలెక్టర్*
ఆయకట్టు ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించాలి* # *ఉపాధి హామీ పథకం పనుల పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్* *మిర్యాలగూడ,వేముల పల్లి మండలం లలో పర్యటించిన కలెక్టర్*
ఆయకట్టు ప్రాంతాలలో కూలీలకు ఉపాధి కల్పించే విధంగా పనులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టర్ వేముల పల్లి,మిర్యాలగూడ మండలం లలో పర్యటించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పై సమీక్షించి అభివృద్ధి కార్యక్రమాలు తనిఖీ చేశారు.
మిర్యాలగూడ స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆకస్మికంగా సమావేశానికి హాజరై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారిగా జూన్ నుండి ఇప్పటివరకు చేపట్టిన ఉపాధి హామీ పనుల వివరాలను తెలుసుకున్నారు. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం ఉపాధి పనులు జరగడం లేదని, కూలీలకు పని కల్పించే విధంగా కొత్త పనులను గుర్తించాలని సూచించారు. కాల్వ పనులు మినహాయించి గ్రామాలలో మిగిలిన ఏ ఏ పనులు చేయవచ్చో గుర్తించాలన్నారు. పనులను గుర్తించి వెంటనే కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. వ్యవసాయ సీజన్లో కూలీలకు ఉపాధి కల్పించినట్లయితే ఈ పద్ధతిని జిల్లా అంతటా అమలు చేసేందుకు ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై జరిగిన అవకతకులపై విలేకరులు ప్రశ్నించగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో సమగ్ర విచారణ జరిపామని అర్హులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోలు శిరీష, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తొలుత వేముల పల్లి మండలం లో ఎం.పి.డి. ఓ కార్యాలయం లో ఎం.పి.డి. ఓ., ఏ.పి.or ఇతర ఈ.జి.యస్ సిబ్బంది తో ఉపాధి పనులు గుర్తింపు,లేబర్ టర్నోవర్, వేతనాల చెల్లింపు లపై సమీక్షించి ఆదేశాలు,సూచనలు చేశారు.ముందుగా వేముల పల్లి లో నర్సరీ సందర్శించారు.నర్సరీ లో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మొక్కల వివరాలు, ఏ ఏ మొక్కలు నాటేందుకు సిద్దం చేస్తున్నారు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.నర్సరీ పక్కనే వున్న పల్లె ప్రకృతి వనం పరిశీలించి వాకింగ్ ట్రాక్,నీడ నిచ్చే పెద్ద మొక్కలు నాటాలని సూచించారు.తెలంగాణ క్రీడా ప్రాంగణం తనిఖీ చేసి క్రీడా ప్రాంగణం లెవెలింగ్ పూర్తి చేయాలని,15 రోజుల్లో పూర్తిగా వినియోగం లోకి వచ్చేలా సిద్దం చేయాలని సర్పంచ్,అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎం.పి.డి. ఓ దేవిక తదితరులు ఉన్నారు
*ఆయకట్టు ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించాలి* # *ఉపాధి హామీ పథకం పనుల పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్*