ఆయా శాఖల ద్వారా దివ్యంగులకు అందాల్సిన సౌకర్యాలు లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

ఆయా శాఖల ద్వారా దివ్యంగులకు అందాల్సిన సౌకర్యాలు లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం బాబు జగ్జీవన్ రామ్ సమావేశ హాల్లొ దివ్యంగ సంఘాల ప్రతినిధులు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యంగులు ప్రభుత్వ పనులపై వివిధ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు కాకుండా అన్ని ప్రభుత్వ భవనాల్లో ర్యాంప్ లు తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ముఖ్యంగా అన్ని మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలకు ర్యాంపులు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జడ్పి సి.ఈ.ఓ ను ఆదేశించారు. ఉపాధిహామీ పథకంలో పనిచేయలనుకునే దివ్యంగులందరికి జాబ్ కార్డులు జారీ చేయాలని, ఏమైనా డియాక్టివ్ట్ అయి ఉంటే వెంటనే యాక్టివేట్ చేయాల్సిందిగా పి.డి డిఆర్డీఓ ను ఆదేశించారు. అంత్యోదయ కార్డులు చాలా తక్కువ మందికి ఉన్నాయని, అర్హులైన వారందరికీ అంత్యోదయ కార్డులు ఇవ్వాలని కలెక్టర్ ను కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. జిల్లాలో మొత్తం ఎంతమంది దివ్యంగులు ఉన్నారు, సదరం సర్టిఫికెట్ లేకుండా ఎంతమంది ఉన్నారో పూర్తి నివేదిక సేకరించాలని నెలలో సదరం క్యాంపుల సంఖ్య పెంచి అర్హులందరికీ సదరం సర్టిఫికెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఓ, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ను ఆదేశించారు. దివ్యంగా ప్రతినిధులు బ్యాంకు సబ్సిడీ రుణాలలో 5 శాతం కోటా ను పాటించి అర్హులందరికీ రుణాలు అందేవిధంగా చూడాలని కోరగా స్పందించిన కలెక్టర్ వచ్చే బ్యాంకర్ల సమావేశంలో చర్చించి తగు ఆదేశాలు జారిచేయడం జరుగుతుందని తెలియజేసారు. దివ్యంగులు సకలాంగులకు వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాలు అర్హులందరికీ ఇచ్చేవిధంగా చర్యలు తీడుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. డిసెంబరులో వచ్చే ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దివ్యంగా సంఘాల ప్రతినిధులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంత్యోదయ కార్డులు, సదరం క్యాంపుల ఏర్పాటు తో పాటు జిల్లాలో చదువుకున్న వికలాంగ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని వారి ఉపాధికై బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి విడుదల చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 2016 లో ప్రతి మండలానికి వికలాంగ గ్రూపులకు రూ. 10 మంజూరు చేయడం జరిగిందని వాటిని స్త్రీ నిధిలో జమ చేశారు తప్ప తమకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నాయని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో వికలాంగుల భవనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు ప్రభుత్వం ద్వారా నిర్మించిన రెండు పడకల ఇళ్ళు కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. అంగన్వాడీ, ఇతర పొరుగు సేవల ఉద్యోగాల్లో తమకు 5 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సాధ్యమైన మేరకు అన్ని నెరవేర్చుతామని భరోసా కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా సంక్షేమ అధికారిణి వెంకటలక్ష్మి, ఇతర జిల్లా అధికారులతో పాటు వికలాంగుల సంఘ ప్రతినిధులు ప్రభుత్వ వికలాంగుల ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందనూలు నిరంజన్. ఎం పీ ఆర్ డి ఇండియా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఉపాధ్యక్షుడు శంకర్
ఎన్ పి ఆర్ డి ఇండియా కొల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నారాయణమ్మ
ఎన్ పి ఆర్ డి ప్రధాన కార్యదర్శి బాల్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post